విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు : పార్థసారథి

-

ఈ నెల 8 తేదీన ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీని సీఎం నియమిస్తారు అని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఎన్టీపీసీ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.65,370 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఎన్టీపీసీ పెడుతోంది. 2500 ఎకరాల్లో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ జోన్ కు కూడా ప్రధాని ప్రారంభిస్తారు. నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్ కు కూడా పీఎం మోదీ శంకుస్థాపన చేస్తారు.

బల్క్ డ్రగ్ పార్కులో రూ.11,542 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. జనవరి 8 తేదీన ప్రధాని మోదీ విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభ నుంచే ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అంతకుముందు విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకూ రోడ్ షో ఉంటుంది. వచ్చే విద్య సంవత్సరం లోగా తల్లికి వందనం పథకం అందించేందుకు నిర్ణయం. రైతులకు ఇచ్చే ఆర్ధిక సాయం అన్నదాతా సుఖీభవ కార్యక్రమాన్ని కేంద్రంతో పాటే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కేంద్ర సాయంతో కలిపి రూ.20 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం. వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్ధిక సాయం రూ.20 వేలు ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారు అని పార్థసారథి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news