73 శాతం రహదారులు పూర్తయ్యాయి : కొలుసు పార్థసారథి

-

బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేసారు. రహదారులు 73 శాతం పూర్తయింది, మిగిలిన రోడ్లను త్వరలో పూర్తి చేస్తామన్నారు. నాణ్యమైన రోడ్లను వేసేలా చర్యలు తీసుకున్నాం అని తెలిపారు. అలాగే జిల్లాలోని సాగునీరు అందించే కాలువలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 92 ప్రాజెక్టులు జిల్లాలో ఉంటే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.

ఇక 52 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు పూర్తి స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. పర్యాటక రంగానికి అనువైన బాపట్ల జిల్లాలో 97 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో ప్రభుత్వానికి పంపామని తెలిపారు. సూర్య ఘర్ గురించి కలెక్టర్, బ్యాంకర్లతో మాట్లాడి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారన్నారు పార్థసారథి.

Read more RELATED
Recommended to you

Exit mobile version