యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం ‘దేవర’ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.ఈ క్రమంలోనే తెలంగాణలో టికెట్ల ధరలు పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం దేవర చిత్రానికి అనుమతులు ఇచ్చింది. అంతేకాకుండా, మిడ్ నైట్ షోకు 29 థియేటర్లలో అనుమతులు మంజూరు చేసింది.
సినిమా విడుదలైన తొలిరోజు మొత్తం 6 షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్‌పై రూ.100 పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్‌పై రూ.25, మల్టీప్లెక్స్ లలో టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. దేవర టికెట్ ధరలు పెంచుకోవడానికి రాష్ట్ర సర్కార్ జీవో రిలీజ్ చేయడంపై ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా బదులిచ్చారు.‘దేవర’ రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ సారథ్యంలోని తమ ప్రభుత్వం ఎప్పుడూ తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.