పవన్ కళ్యాణ్ కు తమిళ స్టార్ హీరో కార్తీ క్షమాపణలు

-

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమిళ స్టార్ హీరో కార్తీ క్షమాపణలు చెప్పారు. తిరుమల లడ్డూ వివాదంపై తాను తప్పుగా మాట్లాడి ఉంటే… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్వారీ చెబుతున్నా అంటూ ట్వీట్‌ చేశారు కార్తీ. ప్రియమైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, మీకు ప్రగాఢ గౌరవాలతో, ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు.

Tamil star hero Karthi apologizes to Pawan Kalyan

వేంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తానని వెల్లడించారు హీరో కార్తీ. కాగా, హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. లడ్డూలతో ఆటలొద్దు అంటూ పరోక్షంగా హెచ్చరించారు. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అంటూ కామెడీ చేశారంటూ హీరో కార్తీ పై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. యాక్టర్ గా మీరు అంటే చాలా గౌరవం అని తెలిపారు… కానీ, సనాతన ధర్మాన్ని గౌరవించిండి అంటూ పవన్ ఫైర్ అయ్యాడు.

https://x.com/Karthi_Offl/status/1838480559925870662

Read more RELATED
Recommended to you

Exit mobile version