సీఎం పదవిపై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ భావి సీఎం కేటీఆర్ అంటూ చాలాకాలంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని, రాష్ట్ర పీఠాన్ని కేటీఆర్ అధిష్ఠిస్తారని గతంలో కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, సీఎం పదవిపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు. తనకు అలాంటి కోరికలు ఏమీ లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ముమ్మాటికీ కేసీఆరేనని స్పష్టం చేశారు.

“ప్రతిపక్షాలకు నా మీద ప్రేమ ఎక్కువగా ఉంది. అందుకే నేను సీఎం కావాలని కోరుకుంటున్నారు” అని కేటీఆర్ చమత్కరించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రైతుల‌కు కాంగ్రెస్ పార్టీ అస‌మ‌ర్థత గురించి తెలుస‌ని, ద‌శాబ్దాలుగా ఆ బాధ‌లు ఎదుర్కొన్నార‌ని, ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో రైతులు ఆ బాధ‌లు అనుభ‌విస్తున్నార‌ని అన్నారు. ‘మా పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించాం. 95 శాతం మందికి బీ ఫామ్‌లు ఇచ్చాం. తాము చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది. మిగతా పార్టీలు అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావు’ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ శ్రేణులు బీజేపీని తక్కువ చేసి మాట్లాడాడని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version