నేను డ్రగ్స్‌ టెస్ట్‌ కు సిద్దమే…రేవంత్‌ కు కేటీఆర్‌ మరో సవాల్..

-

తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. తాను డ్రగ్స్‌ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధమేనని… రాహుల్ గాంధీ కూడా వస్తే తాను ఎయిమ్స్ దాకా రావడానికి అయిన రెడీ అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌.

రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR

చర్లపల్లి జైలు కు వెళ్లి వచ్చిన వారి తో ఛాలెంజ్.. తన స్థాయి కి తగదని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్‌. ” నేను టెస్ట్ చేయించుకుని క్లిన్ చిట్ వస్తే … నాకు క్షమాపణ చెప్పి…నీ పదవుల నుంచి తప్పుకుంటావా ?” అంటూ రేవంత్‌ రెడ్డి కి మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ఓటుకు నోటు కేసులో నీవు లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా ? అని రివర్స్‌ సవాల్‌ విసిరారు మంత్రి కేటీఆర్‌. కాగా..  మంత్రి కేటీఆర్‌ వైట్‌ ఛాలెంజ్‌ కు రావాలని రేవంత్‌ రెడ్డి మొన్న  సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. తాను వైట్ ఛాలెంజ్ సిద్దమని .. కెటిఆర్ కి వైట్‌ ఛాలెంజ్ విసురుతున్నానని పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి. అంతేకాదు… తాను రక్త నమూనాలు ఇస్తానని… ఆ తర్వాత విశ్వేశ్వర రెడ్డీ మరియు కేటీఆర్ ఇవ్వాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version