దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన అయినప్పటికీ తన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మరియు చిన్నపాటి స్వార్ధం ఉండనే ఉంటుంది. అందులో భాగంగానే ప్రతి రాష్ట్రంలో సమయం దొరికినప్పుడల్లా పర్యటిస్తూ స్థానికంగా పార్టీని మరియు క్యాడర్ ను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగంగానే తాజాగా నిజామాబాద్ పర్యటనకు విచ్చేసిన మోదీ ఎప్పటిలాగే తెలంగాణ ప్రభుత్వంపై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్దాలు ఆడారని తీవ్ర సుతఃయిలో ధ్వజమెత్తారు. మోదీ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే తనతో కలిసి పనిచేస్తే మంచి అంటరాని, లేదా వ్యతిరేకిస్తే చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తారంటూ మోదీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
ప్రజలు ముందుంటే చాలు మోదీ లోని మరోకోణం బయటకు వస్తుందంటూ చెబుతూ.. ఆస్కార్ నటుడిలాగా మోదీ నటిస్తారంటూ కామెంట్ చేశారు మంత్రి కేటీఆర్. కాగా ఏ వ్యాఖ్యలపై బీజేపీ నుండి ఎవరైనా స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.