టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఇవాళ కామారెడ్డిలో పర్యటించిన మంత్రి కేటీఆర్
ప్రసంగిస్తూ.. ఈ రేవంత్ రెడ్డి ఒరిజినల్ గా కాంగ్రెస్ మనిషి కాదు, ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ మనిషి అని అన్నారు. 1999లో కిషన్ రెడ్డి కార్వాన్ లో పోటీ చేస్తే ఆయనకు ఎన్నికల ఏజెంటుగా రేవంత్ రెడ్డి వ్యవహరించాడన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేశాడు. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు బీజేపీతో తెరచాటు చీకటి అనుబంధం కొనసాగిస్తున్నాడు. ఆ గాడ్సేను గాంధీభవన్ లో కూర్చోబెట్టింది ఆ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లే. మైనారిటీలు ఆలోచించాలి.
ఢిల్లీ నుంచి ఒకాయన వస్తాడు… మీరు బీజేపీకి బి టీమ్ అంటాడు. ఇంకొకాయన వస్తాడు… మీరు కాంగ్రెస్ కి బి టీమ్ అంటాడు. ఎవరికో బి టీమ్ అవ్వాల్సిన అవసరం మాకేముంది? ఈ 23 ఏళ్లలో ఎలా తెలంగాణ ప్రజలను నమ్ముకుని ముందుకు వెళ్లామో, ఇకపైనా అలాగే ముందుకు వెళతాం… మేం ఎవరికీ బి టీమ్ కాదు. తెలంగాణ ప్రజల ఎ టీమ్ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీనే. ఎవరికో తొత్తుగా, ఎవరికో తోక పార్టీగా ఉండాల్సిన ఖర్మ మాకేం లేదు. కేంద్రంలో కూడా మా పాత్ర లేనిదే ప్రభుత్వాలు ఏర్పడని పరిస్థితి తీసుకువస్తాం” అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.