తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే చెబుతుంటే ఐటీ, ఈడీలు ఎక్కడున్నాయి : కేటీఆర్‌

-

కేంద్రంపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు మంత్రి కేటీఆర్‌. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ 100 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. బహిరంగంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే చెబుతుంటే ఐటీ, ఈడీలు ఎక్కడున్నాయని ఆయన క్యశ్చన్ చేశాడు. ఈ ఇష్యులో బీజేపీకి నోటీసులు జారీ ఇస్తారా? విచారణ జరిపిస్తారా? అని కేటీఆర్ అడిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతి గురించి మాట్లాడ‌టం విడ్డురంగా ఉంద‌న్నాడు మంత్రి కేటీఆర్.

ప్రధాని మోడీ ప్రసంగం అబద్ధాల మూట అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశాడు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పకుండా ప్రధాని ప్రసంగం కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడంపైనే దృష్టి పెట్టారని ఆయన తెలిపారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలకు తెలంగాణ ప్రజలు బీజేపీని తిరస్కరిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే రిపేర్ షాపు ఏర్పాటు చేయడం నిజంగా తెలంగాణ ప్రజలను కేంద్ర ప్రభుత్వం అవమానించడమేనన్నారు.

మోడీ ప్రభుత్వం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ను పట్టించుకోకుండా గుజరాత్ కు రూ.20 వేల కోట్ల విలువైన లోకోమోటివ్ ఫ్యాక్టరీని మంజూరు చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పెండింగ్ హామీలను నెరవేర్చడంలో, డిమాండ్లను పరిష్కరించడంలో ప్రధాని నిర్లక్ష్యాన్ని, వివక్షను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని మంత్రి తన తెలిపారు. సరైన సమయంలో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version