హకీమ్ పేట వద్ద నిన్న రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో మంత్రి కేటీఆర్ అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వాళ్ళను చూసి కేటీఆర్ కాన్వాయ్ ను అపారు. వెంటనే కిందకు దిగి తన సెక్యూరిటీ సిబ్బంది సహాయం తో ప్రమాదం గురించి తెలుసుకున్నారు. తన కాన్వాయ్ లో బాధితులను స్థానిక ఆస్పత్రి కి తరలించారు. అంతే కాకుండా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లకు సూచించినట్టు తెలుస్తోంది.
ఇక కేటీఆర్ వాహనం రోడ్డు పై ఆగడం తో ప్రయాణికులు షాక్ అయ్యారు. రోడ్డు పై మంత్రి నిలబడి ఉండటం తో ఆ దారిలో వెలుతున్నవారు ఆగి మంత్రితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా కేటీఆర్ చేసిన మంచి పని పై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా కూడా ఆపదలో ఉన్నవాళ్లకు సాయం చేస్తూ ఉంటారు. అనారోగ్యం బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించడం ఇతర సేవా కార్యక్రమాలను తన సోషల్ మీడియా టీమ్ ద్వారా నిర్వహిస్తున్నారు.