హిజాబ్ వివాదంపై స్పందించిన మంత్రి కేటీఆర్

-

క‌ర్నాట‌క రాష్ట్రంలో హిజాబ్ వివాదం హింస‌త్మ‌కంగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో ఇప్ప‌టికే ఒకరు హత్య కు గురి అయ్యారు. ఈ హ‌త్యతో ఈ వివాదం మ‌రింత ముదిరింది. క‌ర్నాటక పోలీసులు 144 సెక్షన్లు విధించినా.. ఆందోళ‌న కారులు రోడ్డు పైకి వ‌స్తున్నారు. దీంతో రోజు రోజుకు క‌ర్నాట‌క లో ప‌రిస్థితి చేయి దాటిపోతుంది. కాగ క‌ర్నాట‌క లో జ‌రుగుతున్న హింసపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్ట‌ర్ లో ఒక నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ట్వీట్ చేశారు.

హింస ఏ రూపంలో ఉన్నా.. తాము వ్య‌తిరేకిస్తామ‌ని అన్నారు. అది మ‌త ప‌ర‌మైన హింస అయినా.. తాము ఖండిస్తామ‌ని అన్నారు. కాగ క‌ర్నాట‌క‌లో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ‌త వ‌ల్లే ఈ హింస జ‌రుగుతుంద‌ని అన్నారు. క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ఈ హింస‌ను అదుపు చేయ‌డంలో పూర్తిగా విఫ‌లం అయిందని విమ‌ర్శించారు. కాగ ఈ హింస‌లో పాల్గొన్న నిందితుల అందరిపై ఆ ప్ర‌భుత్వం కఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని తాను భావిస్తున్నాని అన్నారు. అలాగే ఈ హింస‌లో బాధితుల‌కు న్యాయం చేయాల‌ని, ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news