ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు కేటీఆర్ శుభాకాంక్షలు.. బేజేపీకి చురకలు

-

తెలుగు సినిమా ఖండాంతరాలు దాటి రికార్డులు సృష్టిస్తోంది. అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట‌కు ఒరిజిన‌ల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు తెలంగాణ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ కొణ‌తం దిలీప్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సాంగ్‌ను రాసిన చంద్ర‌బోస్‌ కు కూడా ఆయ‌న కంగ్రాట్స్ చెప్పారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల సంద‌ర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కొణ‌తం దిలీప్ గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఇలాంటి ద్వేషపూరిత వ్య‌క్తుల‌ను దూరంగా ఉంచుదాం అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. నాటు నాటు పాట‌కు మోదీ వ‌ల్లే అవార్డు వ‌చ్చిందని ఇలాంటి మ‌తోన్మాద వ్య‌క్తులు చెప్పుకుంటారేమోన‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. RRR బృందాన్ని అభినందించారు. సంగీత ప్రియులను తట్టిలేపిన ‘నాటు నాటు’ పాట.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినిమా డైరెక్టర్ రాజమౌళి, రచయిత చంద్రబోస్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ను అభినందించారు. హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version