హైదరాబాద్ వాసులకు శుభవార్త : నాలుగు లింకు రోడ్లను రేపు ప్రారంభించనున్న కేటీఆర్

-

హైదరాబాద్ వాసులకు మరో శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. హైదరాబాద్ జంట నగరాల్లో నాలుగు లింకు రోడ్లను రేపు ప్రారంభించ నున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన రహదారులకు కనెక్టివిటీ పెంచడం తో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ది కి గాను మిస్సింగ్ లింక్ రోడ్లను చేపట్టిన జీహెచ్ఎంసీ.. ప్రధాన ర‌హ‌దారుల‌ పై ట్రాఫిక్ ఒత్తిడిని త‌గ్గించి, ప్రయాణ దూరాన్ని, స‌మ‌యాన్ని ఆదా చేసేందుకు అనువుగా న‌గ‌ర వ్యాప్తంగా స్లిప్ రోడ్లు, లింక్ రోడ్ల‌ను నిర్మించి అనుసంధానం చేస్తోంది.

నగరంలో 126.20 కిలోమీటర్ల విస్తీర్ణంలో 135 లింక్ రోడ్లను నిర్మించాలని ప్రణాళికలు చేస్తోంది సర్కార్. మొదటి దశలో భాగంగా 37 మిస్సింగ్ రోడ్లను రూ. 313 .65 కోట్లతో చేపట్టేందుకు పరిపాలన సంబంధిత అనుమతులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే రేపు రూ. 27.43 కోట్లతో నాలుగు లింక్ రోడ్ లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇలా దశల వారీగా పనులు చేపట్టనుంది తెలంగాణ సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version