కార్మికులకు గుడ్‌న్యూస్‌.. ఈఎస్ఐ ఆస్ప‌త్రి, డిస్పెన్స‌రీని ప్రారంభం..

-

తెలంగాణలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని సీఎ కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అయితే.. అందుకు తగ్గట్టుగానే ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో ఆ శాఖ కొత్త కొత్త ఆలోచనల శ్రీకారం చుడుతూ.. వైద్య సేవలందిస్తోంది. అయితే.. తాజాగా.. ప‌టాన్‌చెరు పారిశ్రామిక వాడ‌లో ప‌ని చేస్తున్న కార్మికులను దృష్టిలో ఉంచుకొని.. ఇక్క‌డ 30 ప‌డ‌క‌ల ఈఎస్ఐ ఆస్ప‌త్రి, డిస్పెన్స‌రీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి బుధ‌వారం ప్ర‌క‌టించారు. సంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని ఆర్‌సీ పురంలో ఈఎస్ఐ హాస్పిట‌ల్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు మంత్రి మ‌ల్లారెడ్డి.

ఈ ఆస్ప‌త్రి నిర్మాణం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 2 ఎక‌రాల స్థ‌లాన్ని కూడా కేటాయించింద‌ని గుర్తు చేశారు మంత్రి మ‌ల్లారెడ్డి. ప‌టాన్‌చెరు పారిశ్రామిక వాడ‌లో సుమారు 2 ల‌క్ష‌ల మంది కార్మికులు ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు మంత్రి మ‌ల్లారెడ్డి. ఈ ఆస్ప‌త్రి అందుబాటులోకి వ‌స్తే ల‌క్ష‌లాది మంది కార్మికుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు మంత్రి మ‌ల్లారెడ్డి. అంతేకాకుండా.. పేదలకు మెరుగైన సేవలందించేందుకు కేసీఆర్‌ సర్కార్‌ ఎప్పుడూ ముందుంటుందని, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఎన్ని పార్టీలు వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీని తాకలేరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version