నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తూ,నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసానని, ఇకముందు కూడా ప్రజాభిష్టం మేరకే పనిచేస్తామని వనపర్తి నియోజకవర్గం బీఅర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.బుధవారం వనపర్తి నియోజకవర్గం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 1,2,వార్డులలో బీఅర్ఎస్ అభ్యర్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.వార్డుల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ మద్దతు ను కోరారు. ఈ సందర్భంగా వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తాను పదవుల్లో ఉన్న లేకున్నా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్స్ పెంచుతామన్నారు. పేదలకు వంట భారం తగ్గించేందుకే రూ.400 సిలిండర్ ప్రతి కుటుంబానికి అందజేస్తామన్నారు. జిల్లాలో అన్యాక్రాంతమైన చెరువులను పునరుద్ధరించి ట్యాంక్ బండ్‌లుగా, మరుగునపడ్డ స్థలాలను పార్కులుగా తీర్చిదిద్దామన్నారు.11 పార్కులను అహ్లాదకరంగా తీర్చిదిద్ది ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రూ.425 కోట్ల ప్రత్యేక నిధులతో వనపర్తికి మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా చేశామని పేర్కొన్నారు. ప్రజల జీవనప్రమాణాలు పెంచే విధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలన్నారు.