ప్రభుత్వం వీఆర్ఎలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది : నిరంజన్‌ రెడ్డి

-

వీఆర్ఎలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఇందూ గార్డెన్ లో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన వీఆర్ఎ కుటుంబాల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొ్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వివిధ శాఖలలో నియమించామని ఆయన వెల్లడించారు. వచ్చిన అవకాశాన్ని అందరూ సంతోషంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గతంలో గ్రామ సేవకులు అనే అనాగరిక భాషను తొలగించి వీఆర్ఏలు అని పేరు మార్చామని, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులను చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు అత్యధిక జీతాలు అందుకుంటున్నది తెలంగాణ రాష్ట్రంలోనేనని వెల్లడించారు. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుంటున్నామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణది దేశంలో అగ్రస్థానమని అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version