వనపర్తిలో కల్యాణలక్షి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మానవీయ పాలన కొనసాగుతున్నదన్నారు. రాకతో తెలంగాణలో బాల్య వివాహాలు ఆగిపోయాయన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ పెట్టిన ప్రతి పథకం తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. దీర్ఘకాలిక లక్ష్యాలు దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినవేనన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
సంప్రదాయం పేరుతో ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న బాల్య వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో అడ్డుకట్ట వేసినట్లయిందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇతర రాష్ట్రాలు ఈ పథకాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. అనంతరం లబ్ధిదారులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఐకమత్యం పెంపొందించాలనే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.