మునుగోడుకు వస్తే.. కేసీఆర్‌ ను నిలదీయండి – బండి సంజయ్

-

మునుగోడుకు వస్తే.. కేసీఆర్‌ ను నిలదీయండని బండి సంజయ్.. ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ మండలం లలోని తాళ్లసింగారం గ్రామంలో “చాయ్ పే చర్చా” కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ బండి సంజయ్. “చాయ్ పే చర్చ” కార్యక్రమంలో తమ సమస్యలను బండి సంజయ్ ముందు ఏకరువు పెట్టారు తాళ్లసింగారం గ్రామస్తులు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. గ్యాస్ విషయంలో మీపై పెద్దగా భారం పడడం లేదు… కేవలం నెలకు రూ.30 మాత్రమే భారం పడుతోంది.

అంతర్జాతీయ చమురు(ఉక్రెయిన్ యుద్ధం) ధరలు పెరిగిన నేపధ్యంలోనే ధరలు పెరిగాయని గ్రామస్తులతో బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి మీకు పంపిస్తున్న నిధులను కేసీఆర్ బొక్కేస్తున్న కారణంగానే మీ వరకు రావడం లేదన్నారు. తెలంగాణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం మంజూరు చేసిన రెండు లక్షల పైచిలుకు ఇళ్లను కేసీఆర్ నిర్మించకపోవడంతోనే… మీకు ఇళ్ళు రాలేదని మండిపడ్డారు బండి సంజయ్. మీకు ఇండ్లు ఇవ్వని పాపం కేసీఆర్ దేనని.. ఇప్పటికైనా కేసీఆర్ ను నిలదీయండని పేర్కొన్నారు. బీజేపీ ని గెలిపిస్తే… మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్… తన కుటుంబానికే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version