పెద్దిరెడ్డి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటీ…?

-

తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఇప్పుడు విజయం దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ ఏ విధంగా అయినా సరే విజయం సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలను రెఫరెండంగా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వీకరించారు.

అంతేకాకుండా తిరుపతిలో మేము ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామా చేయిస్తామని తెలుగుదేశం పార్టీ ఓడిపోతే టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తారా అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రి వ్యాఖ్యలు తర్వాత ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముందు నాలుగు లక్షల మెజారిటీ వస్తుందని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు మెజారిటీ సంగతి పక్కనబెట్టి గెలుపోటములు వరకు వెళ్లారని అంటున్నారు.

ఇది వైసీపీని ఇబ్బంది పెట్టే అంశమని మెజారిటీ అంశాన్ని పక్కకు మళ్ళించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తిరుపతిలో వైసీపీలో విభేదాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అందుకే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మెజారిటీ రాదని భావిస్తున్నారని… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్ళినా సరే పెద్దగా అనుకూల పరిస్థితులు ఉండకపోవచ్చని అంచనా వేసుకున్న తర్వాత పర్యటన కూడా రద్దు చేసుకున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version