మంత్రి బైక్ ఎక్కిన హీరోయిన్ ఈషా రెబ్బ.. అందుకేనా..?

-

`అంతకు ముందు ఆ తర్వాత` సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. ఆ తర్వాత ‘బందిపోటు’, ‘అమీ తుమీ’, వంటి సినిమాల్లో నటించిన సరైన బ్రేక్ రాలేదు. ఇక నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఎన్టీఆర్ అరవింద సమేతలోనూ న‌టించింది ఈ బ్యూటి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ఈమె నేడు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బైక్ మీదు ప్ర‌యాణించారు. ఎంద‌కా అనుకుంటున్నారా..? రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు భద్రతా నిబంధనలను పాటించాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉద్బోధించారు.

రవాణాశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలను సోమవారం ఆయన నెక్లెస్‌రోడ్డు ఐమాక్స్‌ పక్కనున్న హెచ్‌ఎండీఏ మైదానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పువ్వాడ హెల్మెట్‌ ధరించి మోటార్‌సైకిల్‌ను నడిపారు. ఆయనతో పాటే బైక్‌పై అరవింద సమేత ఫేమ్‌ నటి ఈషా రెబ్బ ప్రయాణించారు. నిబంధనలను పాటించకపోవడంవల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని, కారు, ఇతర వాహనాల్లో సీట్‌ బెల్టు పెట్టుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version