యావత్త ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అయితే.. దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, తాజా విద్యాసంవత్సరంలో తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరిగుతున్న నేపథ్యంలో సెలవులను పొడగిస్తారనే వార్తలు వెలువడ్డాయి.
అయితే, కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో సెలవుల పొడిగింపుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు ప్రకటించిన విధంగానే ఈ నెల 13న పాఠశాలలు పునఃప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే పాఠశాలల పునః ప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు మంత్రి ముందుకు కరోనా పరిస్థితులను తీసుకెళ్లారు.