మట్టిసారాన్ని ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం : వెంకయ్యనాయుడు

-

ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ చొరవ అత్యంత ఆవశ్యకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. మట్టిసారాన్ని మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయమని ఆయన అన్నారు. ఈ విషయంలో దిగుబడి ఎంత ముఖ్యమో, ప్రకృతి పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. రైతునేస్తం పబ్లికేషన్స్‌ ప్రచురించిన “ప్రకృతిసైన్యం” పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో వెంకయ్య ఆవిష్కరించారు.

సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు మళ్లీ పట్టం కడుతూ, విజయాలు సాధించిన 100 మంది రైతుల విజయ గాథలను పుస్తకంగా తీసుకురావడాన్ని అభినందించారు. ఈ పుస్తకంలో చోటు సంపాదించుకున్న రైతులందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. మన అవసరాలకు అనుగుణంగా దిగుబడి సాధించడంలో పర్యావరణాన్ని అశ్రద్ధ చేశామని, ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపడం ఆనందదాయకమని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులను అదుపు చేసుకుని స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చన్నారు. విద్యుత్, నీటి విషయంలో కూడా వాడకాన్ని తగ్గించి, పెట్టుబడిని తగ్గించుకోవచ్చని, పెట్టుబడి తగ్గిందంటే రైతు లాభం పెరిగినట్టేనని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version