ఎన్టీఆర్ బొమ్మతో బాబుకి రాజకీయాలు మాత్రమే కావాలి : మంత్రి సీదిరి అప్పల రాజు

-

టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో దొంగ ఓట్లతోనే చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో 30 వేల నుంచి 40 వేల వరకు నకిలీ ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ కి ప్రత్యేక గుర్తింపు కావాలనే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. ఎన్టీఆర్ బొమ్మతో చంద్రబాబుకు రాజకీయాలు మాత్రమే కావాలని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ పేరు మీద స్పాన్సర్డు కార్యక్రమం పెట్టి బిజెపి నేతలతో లాభం చేశాడని మంత్రి శ్రీధర్ అపలరాజు సంచలన కామెంట్స్ చేసారు. సమయంలో విశాఖ మత్స్యకారుల సమస్యలపై కూడా మాట్లాడారు మంత్రి సీదిరి అప్పలరాజు. విశాఖలో మత్స్యకారుల సమస్య ఇప్పటిది కాదు.. గత 30 ఏళ్ల కింద ఇచ్చిన హామీ అమలు కాలేదు అన్నారు. విశాఖ మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం తాను కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. మత్స్యకారులకు ఇండ్ల స్థలాలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news