ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీ శైలం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని తెలంగాణ మంత్రి సీతక్క ఆదివారం ఉదయం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వామి దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయ పిఆర్‌ఓ శ్రీనివాసులు, అర్చకులు, వేదపండితులు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రికి అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ అధికారులు జ్ఞాపికను అందజేశారు. అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలను మంత్రికి అందించారు.కార్తీకమాసం ముగియడంతో నేడు అమావాస్య గడియల వేళ సీతక్క శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మంత్రి వెంట వెంట అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, శ్రీశైలం టీడీపీ నాయకులు ఉన్నారు.