నువ్వు మళ్లీ జైలుకు పోవాల్సిందే.. కేటీఆర్‌కు కాంగ్రెస్ కౌంటర్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘నువ్వు చేసిన పాపాలకు తెలంగాణలో ఏ జైలు సరిపోదు..నీకు అండమాన్ జైలే సరైందని’ ఎదురుదాడికి దిగింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో.. సరిగ్గా 15 ఏళ్ళ కిందట తనను అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారని.. జైలుకెళ్లిన ఆ రోజు జైలు జీవితాన్ని గుర్తు చేసే ఆ బ్యాడ్జీ జీవితాతం నాకు ఆరాధనీయమని కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై నేడు టీ కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తూ.. ‘15 ఏళ్ళ కిందట అరెస్ట్ చేసి నిన్ను వరంగల్ సెంట్రల్ జైలులో పెట్టారని 100 ఏళ్ళ చరిత్ర కలిగిన జైలును కూలగొట్టించావు. ఆ పాపం ఊరికే పోదని, అధికారంలో ఉండగా మదంతో కళ్ళు నెత్తి కెక్కిన నీకు..ఉద్యమకారులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎవరు కనపడలేదని.. అధికారం పోగానే అందరి మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న నీ తీరు యావత్ తెలంగాణ సమాజం చూస్తుందని’ ఫైర్ అయ్యింది. ‘నువ్వు నీ కుటుంబం చేసిన పాపాలకు శిక్ష పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, మళ్ళీ నువ్వు జైలుకు పోవడం ఖాయం’ అంటూ ట్వీట్ చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version