కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన మంత్రి సీతక్క

-

ఏఐసీసీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పలువురు మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండాలతో పాటు అనుబంధ గ్రామాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. అయితే చాలా గ్రామాల్లో నేటి వరకు పంచాయతీ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,176 గ్రామ పంచాయతీలకు భవనాలు లేవని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి సీతక్క తెలిపారు. అద్దే భవనాల్లో ప్రభుత్వ సిబ్బంది స్వేచ్ఛగా పని చేయకపోతున్నారని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం ద్వారా పంచాయతీ భవనాల నిర్మాణం కోసం రూ.1,544 కోట్లు మంజూరు చేయాలని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి సీతక్క వినతిపత్రం అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news