స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భారతీయుడు -2.ఈ మూవీ ట్రైలర్ను చిత్ర యూనిట్ ముంబైలో జరిగిన ఈవెంట్లో విడుదల చేసింది. ‘భారతీయుడు’కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ జులై 12న విడుదల కానుంది.తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్,మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, సముద్రఖని, ప్రియా భవాని శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.ఇటీవల విడుదలైనటువంటి ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.