ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేసీఆర్ పాలన ను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు ఇదే తరహా పాలన కావాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రంజిత్ రావు నిర్మించిన ‘దేశ కా నేత ‘ప్రత్యేక పాటను మంత్రి ఆవిష్కరించారు. గతంలో సినీ పరిశ్రమ అంటే కొన్ని కుటుంబాలకే వారస్వతంగా ఉండేదని ….రాష్ర్ట అవతరణ తర్వాత తారతమ్యాలు లేకుండా ప్రభుత్వం అందరూ రాణించేలా కృషి చేస్తుందన్నారు.
నరేంద్రమోదీ అస్తవ్యస్త పాలనతో విసిగి వేసారుతున్న దేశ ప్రజలు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ విపక్షంగా విఫలమైన ఈ తరుణంలో కేసీఆరే నిజమైన ప్రత్యామ్నాయంగా యావత్ దేశం గుర్తించిందని తెలిపారు. భాజపా ముక్తభారత్ కోసం కేసీఆర్ వెంటనే జాతీయ పార్టీని స్థాపించాలని కోరారు. అన్ని రాష్ట్రాల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని, తామంతా ఆయన వెంటే నడుస్తామని తెలిపారు. తెలంగాణ ప్రగతి నమూనా దేశమంతటికీ విస్తరించాలని, బంగారు భారత్‌గా మారాలన్నారు.