టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌‌కు తప్పిన పెను ప్రమాదం

-

టీమ్ ఇండియా యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు వెంకటేష్ ఆడుతున్నాడు. శుక్రవారం, కోయంబత్తూర్ వేదికగా వెస్ట్ జోన్-సెంట్రల్ జోన్ సెమీఫైనల్ మ్యాచ్ రెండో రోజు ఆట జరిగింది. వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తుండగా, వెస్ట్ జోన్ బౌలర్ చింతన్ గజా బంతిని సంధించాడు. అయితే ఆ బంతి గజ వద్దకు వెళ్ళింది. అంతకుముందు బాల్ ను సిక్స్ గా మలచడంతో గజ ఫ్రస్టేషన్ లో ఉన్నాడు.

దీంతో వెంటనే బంతిని వెంకటేష్ మీదకు విసిరాడు. అది నేరుగా వెంకటేష్ అయ్యర్ మెడకు తాకడంతో బాధతో మైదానంలోనే విలవిలలాడిపోయాడు. వెంటనే ఫీజియో పరుగున వచ్చి అయ్యర్ పరీక్షించాడు. అయితే కాసేపటికి తేరుకున్న వెంకటేష్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ఆంబులెన్స్ ను కూడా మైదానంలోకి తీసుకొచ్చారు. నొప్పిని భరిస్తూనే కష్టాల్లో ఉన్న తన జట్టు సెంట్రల్ జోన్ కోసం వెంకటేష్ అయ్యారు. బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే 14 పరుగులకే అవుట్ అయి పెవీలియన్ చేరాడు. అందులో రెండు ఫోర్లు, సిక్స్ ఉండడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version