దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే ఈ మంత్రి పై హత్యాయత్నం అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. స్టీఫెన్ రవీంద్ర స్క్రీప్టులో నిజం లేదని.. అందుకే బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరులో అడిగితే జితేందర్ రెడ్డి అంటే ఏమిటో చెబుతారని అన్నారు. మంత్రి హత్యకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ మీద నమ్మకం లేకుంటే… జ్యుడిషియల్ ఎక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కు భయం పట్టుకుంది… దుబ్బాక, హుజూరాబాద్ తర్వాత భయం మొదలైంది- మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
-