రేవంత్ కొత్త ట్విస్ట్..టికెట్లు వారికే?

-

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ మధ్య బాగా దూకుడుగా ఉంటున్నారు…ఇక సైలెంట్‌గా ఉంటే టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా ఉండటం కష్టమైపోతుందని భావించి రేవంత్…ఇటీవల కాలంలో మరింత ఎటాకింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు…అలాగే సొంత పార్టీలో ఉన్న లుకలుకలని సైతం చేయకుండా తనదైన శైలిలో ముందుకెళ్లిపోతున్నారు…మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా రేవంత్ పనిచేస్తున్నారు..ఈ క్రమంలోనే ఊహించని విధంగా రాజకీయం నడిపిస్తున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

పార్టీ బలోపేతం కోసం ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడటం లేదు..ఇటీవలే పార్టీ సభ్యత్వాలు పెంచడం కోసమని చెప్పి…పార్టీ సభ్యత్వం ఉన్నవారికే నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే…సంక్షేమ పథకాలు అందిస్తామని, వారికే మొదట ప్రాధాన్యత ఇస్తామని, అలాగే ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో రేవంత్ పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు…పాదయాత్ర చేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని రేవంత్ భావిస్తున్నారు…అందుకే త్వరలోనే రాష్ట్రమంతా పాదయాత్ర చేసేందుకు రేవంత్ రెడీ అవుతున్నారు…అయితే రేవంత్ పాదయాత్రకు బ్రేకులు వేయడానికి సీనియర్ నాయకులు గట్టిగానే ట్రై చేస్తున్నారు…కానీ రేవంత్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకెళ్ళేందుకే ప్లాన్ చేసుకున్నారు. అలాగే టికెట్లు కేటాయించే విషయంలో కూడా రేవంత్ దూకుడుగానే ఉంటున్నారు…ఈ సారి ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చేవారికి సీట్లు ఇవ్వకూడదని రేవంత్ భావిస్తున్నారు…ముందు నుంచి నియోజకవర్గాల్లో ప్రజల మధ్యలో ఉన్నవారికి, ఆర్ధికంగా బలంగా ఉన్నవారికి…అలాగే ఎవరైతే తమ తమ నియోజకవర్గాల్లో ఎక్కువ సభ్యత్వాలు చేయించారో…అలాంటివారికే సీట్లు ఇవ్వాలని రేవంత్ చూస్తున్నారట.

సీనియర్లు పేచీ పెట్టిన సరే అధిష్టానాన్ని ఒప్పించి సమర్ధవంతమైన నేతలకే టికెట్లు దక్కేలా చేయాలని అనుకుంటున్నారు..ఈ విషయంలో రేవంత్ ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అలా కాకుండా పనులు చేయకుండా సీనియర్ల రికమండేషన్‌తో సీట్లు దక్కించుకోవాలనే వారికి రేవంత్ చెక్ పెట్టాలని చూస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version