బ్రేకింగ్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య కు పాల్పడ్డ యువకుడు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ PA కుమారుడు అక్షయ్ కుమార్(23) గా గుర్తించారు పోలీసులు. కొండాపూర్ సెంట్రల్ పార్క్ లోని ఇంట్లో తల్లి తండ్రులతో కలిసి ఉంటున్న అక్షయ్…ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీంతో ఆ యువకుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. మహబూబ్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కామ్ లో అక్షయ్ ఆరోపణలు ఎదుర్కుంటున్నట్లు అక్కడి పోలీసుల ద్వారా తెలిసింది..ఆత్మహత్య కు కారణాలేంటో.. విచారణ తర్వాత తెలుస్తుందని గచ్చిబౌలిపోలీసులు చెబుతున్నారు.