మహబూబ్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన నర్మ గర్భ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ మేరకు ఒక వీడియో వైరల్ అవుతోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందరికి రావని, కట్టెటివి చాలా తక్కువ. అవి లాటరీలో ఇస్తామని చెబుతున్నారు. ఏ ప్రభుత్వము కూడా లక్షల్లో ఇండ్లు కట్టివ్వదని, దరఖాస్తులు పెట్టుకొని తిరగొద్దు దేవుని దయ ఉంటే వచ్చే లాటరీ లో వస్తుందని ఆయన అన్నారు.
స్థోమత ఉన్న వారు ఎక్కడో ఒక చోట ఇల్లు కట్టుకోండని ఆయన పేర్కొన్నారు. ఇక మరికాసేపట్లో వనస్థలిపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబిత, ఎంపీ రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. 28.02 కోట్లతో 9 అంతస్తుల్లో 324 ఇళ్ల నిర్మాణం జరగగా గ్రేటర్లో ఇప్పటికే ₹9, 714 కోట్ల తో 97 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టగా, 30 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి.