లాటి దెబ్బలకు భయపడకుండా కాంగ్రెస్ కోసం పనిచేశారు. కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలి. గౌరవంగా తలెత్తుకుని వుండే విధంగా పనిచేయాలి అని మంత్రి తుమ్మల అన్నారు. ప్రతిపక్షానికి అవకాశం లేకుండా కృషి చేసి ఆ కుర్చీ లో మనం కూర్చోవాలి. ఎన్నికలు ఛాలెంజ్ గా తీసుకోవాలి. పదవి నీ పిలిచి ఇచ్చే రోజులు వస్తాయి. ఎంఎల్ఏ టికెట్ రాని వాళ్ళు ఎంపిలు అయ్యారు. పార్టీని బ్రతికించు కోవాలి. తల్లిని కూడా మోసం చేసే వారి పట్ల జాగ్రత్త గా వుండాలి. పార్టీకి ద్రోహం చేస్తే తల్లికి ద్రోహం చేసినట్లు గుర్తించాలి.
నన్ను కాంగ్రెస్ అక్కున చేర్చుకుంది. నిబద్ధత గా పని చేస్తాను. పార్టీ క్రమ శిక్షణ గల వారికి ప్రాధాన్యత వుంటుంది. అవకాశ వాదులను నమ్మ రాదు . అధికారాన్ని అస్థగతం చేసుకోవాలి. సీఎం శక్తికి మించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు. దేశంలోనే రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. కానీ కేంద్రం సహకరించడం లేదు. మనకు కావలసిన నిధులు ఇవ్వడం లేదు. నీటిపారుదల ఇరిగేషన్ రోడ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల పాజిటివ్ గా లేరు. గుండె ధైర్యంతోని సొంత కాళ్ళ మీద నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోరికలు తీరుస్తున్నాను. కార్యకర్తలు అడిగిన ప్రతి పని బాకీ లేకుండా పూర్తి చేస్తాను. ఖమ్మం నియోజకవర్గానికి 1400 కోట్లు సీఎం ఇచ్చారు అని మంత్రి తుమ్మల అన్నారు.