బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన

-

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై బీఆర్ఎస్  నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల జనాభాను కావాలనే తగ్గించిన సీఎం రేవంత్ వారని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ఇప్పుడే కాదు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, ప్రభుత్వంలోనూ బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేదాకా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతామని కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో, రేషన్ కార్డులలో, ఇండ్ల కేటాయింపుల్లో, ఆరు గ్యారంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని అట్టడుగు స్ధాయిలో ఉన్న ఎంబీసీలు, బీసీ బిడ్డలు భయపడుతున్నారని అన్నారు.

“ఉల్టా చోర్ కొత్వాల్ కి డాంటే” అన్నట్టుగా రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను విమర్శిస్తుందని ఎద్దేవా చేశారు. బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి
సిద్ధరామయ్య నోటి వెంట కాంగ్రెస్ పార్టీ చెప్పించిందని గుర్తుచేశారు. ఐదున్నర శాతం జనాభా
తగ్గించి దాదాపు 22 లక్షల మందిని లేనట్టుగా చిత్రీకరించిన దుర్మార్గాన్ని రేవంత్ రెడ్డి చేసిండని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news