కులగణన సర్వేపై కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కులగణన సర్వే పాదర్శకంగా జరిగింది. కేటిఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బిసి కులఘనన ను తప్పులు తడక అంటున్నారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇల్లిల్లు పరిశీలన చేసి ఘనన చేయడం జరిగింది. కులఘనన దేశానికే ఆదర్శంగా చేపట్టము.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటిఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పంతో పూర్తి చేసింది. కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదు. 1931 తర్వాత కులఘనన జరిగింది ఇది బీసీ లకు ఎంతో మేలు జరుగుతుంది. పక్కాగా పకడ్బందీగా కులఘనన ను దేశంలోనే మొదటిసారి చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానిది.
2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడడం అవివేకం. బీసీలకు న్యాయం జరుగుతుంటే కేటీఆర్ భరించలేక పోతున్నారు. కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు రీ – సర్వే గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. బలహీనవర్గాల గురించి కేటీఆర్ మాట్లాడటం హస్యాస్పదం. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగింది అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.