తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. తెలంగాణ ఇరిగేషన్ శాఖ పై అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కృష్ణ ప్రాజెక్ట్ లో కెఆర్ఎంబి అంశాల మీద అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది అయితే ఈ తీర్మానాన్ని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్ పై పోలీసుల్ని పంపిందని తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు కి కేఆర్ఎంబికి అప్పగించేది లేదని చెప్పారు షరతులు అంగీకరించుకున్న ప్రాజెక్ట్లను కేఆర్ఎంబికి అప్పగించేది లేదని చెప్పారు కృష్ణ బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదని నీటి వాటాలకి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో బీఆర్ఎస్ విఫలమైందని అన్నారు.