మత్తుమందు ఇచ్చి బాలికపై గ్యాంగ్ రేప్​

-

ఉత్తర్​ప్రదేశ్​ హథ్రస్​లో మరో దారుణం చోటు చేసుకుంది. శిక్షణకు వెళ్లి తిరిగి వస్తున్న బాలికకు మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ కావడం వల్ల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సాదాబాద్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో నివసించే ఓ బాలిక అక్టోబర్​ 10న కోచింగ్ సెంటర్​కు వెళ్లింది. అనంతరం తిరిగి వస్తున్న ఆమెను ఐదుగురు నిందితులు అడ్డగించారు. ఆమెకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్​ ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను.. సమీపంలోని ఇంటర్ కాలేజీ ఆవరణలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు నిందితులు. అనంతరం కోచింగ్ సెంటర్​ వద్ద వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం బయట చెబితే చంపేస్తామంటూ బెదిరించడం వల్ల బాలిక ఎవరికీ చెప్పలేదు. ఇటీవల ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ కావడం వల్ల యువతిని ప్రశ్నించగా.. అసలు విషయాన్ని బయటపెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news