మంత్రి అంబటి రాంబాబు: చంద్రబాబు “కాపు కులస్తులకు” వ్యతిరేకి…

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మరియు టీడీపీ నాయకుల మధ్యన నిత్యం ఏదో ఒక అంశం పైన వాగ్వడం జరుగుతూనే ఉంటుంది. ఇక తాజాగా మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గురించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు కమ్మ కులానికి సంబంధించిన నాయుకులపై అనేక కేసులు పెట్టారని చెప్పారు. తుని రైలు దగ్ధం కేసును కొట్టివేయడంతో.. చంద్రబాబు మరియు రామోజీరావు లు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. గతంలో కాపు నాయకులపై మొత్తం 69 కేసులు పెట్టించారని గుర్తు చేశారు.

కానీ ఈ కేసులు అన్నీ సీఎం జగన్ తెచ్చిన ఒక్క జీవో తో పటాపంచలు అయిపోయాయని గుర్తు చేశాడు అంబటి రాంబాబు. తాను అధికారంలో ఉన్నా లేకపోయినా కాపులకు నిత్యం చంద్రబాబు పూర్తి వ్యతిరేకి అని స్టాంప్ వేసేశాడు రాంబాబు. మరి అంబటి చేసిన ఈ వ్యాఖ్యల పై టీడీపీ నుండి ఎవరైనా కామెంట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version