నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. అందులో భాగంగా మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థపాన చేశారు. మెడికల్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అద్దాల మేడలు, రంగుల మేడలు అభివృద్ధి కాదు అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలన్నారు.
మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి పారామెడికల్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఇతర దేశాల్లో వైద్య సేవలందించడానికి ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. హాస్పిటల్ ని ఇక్కడికే షిప్ట్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా జీవితంలో కీలక సమయం అన్నారు. మెడికల్ కాలేజీలకు నిధుల లోటు రానివ్వం అన్నారు. 70ఏళ్ల తరువాత మహబూబ్ నగర్ నుంచి సీఎం అయ్యే అవకాశం వచ్చింది. పాలమూరు బిడ్డగా గర్వంగా మాట్లాడుతున్నా. మారుమూల పల్లెలకు వైద్య సేవలందించాలన్నారు. వైద్య వృత్తి అనేది ఉద్యోగం కాదు.. అది ఒక బాధ్యత అన్నారు.