అందాలు వడ్డిస్తున్న.. ఓరి దేవుడా.. హీరోయిన్‌

-

ఓ మై కడవలే సినిమాను తెలుగులో ఓరి దేవుడా అంటూ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాల్కర్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అయితే మిథిలా అందాల ప్రదర్శన మాత్రం ఇప్పుడు జనాలను ఆకట్టుకుంటోంది.

విశ్వక్ సేన్ హీరోయిన్‌గా ఇప్పుడు మిథిలా నెట్టింట్లో సందడి చేస్తోంది. ఓరి దేవుడా సినిమా అక్టోబర్ 21న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం మిథిలా మీడియా ముందుకు వస్తోంది. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ ఇంటర్వ్యూలు కూడా వైరల్ అవుతున్నాయి.

మిథిలా పాల్కర్ మీద రామ్ చరణ్ చేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. మిథిలా పాల్కర్ ఇక్కడి ప్రేక్షకులకు కొత్తేమో గానీ.. ఆమె ఓటీటీ స్టార్ అని.. ఆమెకు తన భార్య ఉపాసన, తాను పెద్ద అభిమానులమని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

మిథిలా పాల్కర్ సైతం ఈ సినిమా పట్ల భారీగా హోప్స్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి, తనకు పంచుతున్న ప్రేమకు థాంక్స్ అంటూ మిథిలా పాల్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version