హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. మూడు రోజులు వర్ష సూచన

-

ఇటీవలే నైరుతి రుతుపవనాలతో వర్షలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈశాన్య రుతుప‌వ‌నాలు చురుకుగా క‌దులుతున్నాయి. దీంతో త‌మిళ‌నాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర‌లో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో.. రాగ‌ల మూడు రోజుల్లో హైద‌రాబాద్‌లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. న‌వంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృత‌మై ఉంటుంద‌ని తెలిపింది. సాయంత్రం, రాత్రి స‌మ‌యాల్లో మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది వాతావ‌ర‌ణ కేంద్రం.

ఉద‌యం వేళ‌ల్లో పొగ‌మంచు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది వాతావ‌ర‌ణ కేంద్రం. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం న‌గ‌రం వ్యాప్తంగా తేలిక‌పాటి వ‌ర్షం కురిసింది వాతావ‌ర‌ణ కేంద్రం. 4 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. రాబోయే మూడు రోజుల్లో క‌నిష్ఠంగా 17 నుంచి 19 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు, గ‌రిష్ఠంగా 28 నుంచి 30 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది వాతావ‌ర‌ణ కేంద్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version