బ్రేకింగ్ : మిథున్ చక్రవర్తి కొడుకు మీద రేప్ కేసు

మహిళపై అత్యాచారం, మోసం చేసినట్టు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ ఆయన తండ్రి మాజీ భార్య యోగితా బాలిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఒక పోలీసు అధికారి ఈరోజు తెలిపారు. 38 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మొన్న రాత్రి ఓషివారా పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదైందని ఆయన తెలిపారు. “ఆమె 2015 నుండి 2018 వరకు మహాక్షయ్ చక్రవర్తితో సదరు మహిళ రిలేషన్ లో ఉందని, ఆ కాలంలో ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొంది.

వారు రిలేషన్ లో ఉండగా అంటే 2015లో అంధేరి వెస్ట్ లోని ఆదర్శ్ నగర్ వద్ద ఉన్న మహాక్షయ్ కొనుగోలు చేసిన ఫ్లాట్ చూడటానికి వెళ్ళానని, అక్కడికి వెళ్ళినప్పుడు, నిందితుడు ఆమెకు మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి బలవంతంగా తనను అనుభావించాడని ఆమె పేర్కొంది. తాను గర్భవతి అయినప్పుడు, మహాక్షయ్ శిశువును గర్భ స్రావం చేయమని కోరాడని దానికోసం మాత్రలు ఇచ్చాడని ఆ మహిళ ఆరోపించింది. తనని వివాహం చేసుకోమని అడిగేదానినని 2018 జనవరిలో, అతను తనను వివాహం చేసుకోలేనని చెప్పాడని అన్నారు.