లడఖ్ లో కిషన్ రెడ్డి… ఎందుకు…?

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లడఖ్ వెళ్ళారు. లడఖ్ లో ఆయన అక్కడి సైనికులతో మాట్లాడారు. సైనికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు సరిహద్దుల్లో ఉన్న వాస్తవ పరిస్థితిని కిషన్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకోవడమే కాకుండా వ్యూహాత్మక ప్రాంతాలను కూడా పరిశీలించారు. అక్కడి కొండ ప్రాంతాల్లో కూడా ఆయన సైనికులతో కలిసి తిరిగారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ… నేను లేహ్ నుండి నుబ్రాకు వెళ్ళేటప్పుడు, ప్రశాంతమైన లడఖ్ భూమికి చేరుకున్నా అన్నారు. 18,600 అడుగుల ఎత్తులో, ఖార్డోంగ్లా – నుబ్రా రోడ్ వద్ద సైనికులతో మాట్లాడా అని ఆయన చెప్పారు. ఇటీవల సరిహద్దులకు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ వెళ్ళారు. అయితే హోం శాఖ నుంచి మాత్రం ఎవరూ సరిహద్దులకు వెళ్ళలేదు.