మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపుల ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఎట్టకేలకు పదవికి రాజీనామా చేశారు.సోషల్ మీడియా లో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో చేసేదేమి లేక పదవి నుంచి తప్పుకున్నారు. ప్రియరమణి అనే జర్నలిస్టు ఆయనపై ట్విటర్ ద్వారా ఆరోపణల చేశారు. ఆ తర్వాత వరుసగా దాదాపు 20 మంది మీటూ అంటూ మీడియా ముందుకు వచ్చారు విషయాన్ని భాజపా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రెండు రోజుల క్రితం అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రియరమణిపై అక్బర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై పలు జర్నలిస్టు సంఘాలు, మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.