కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశ వ్యవస్థనే ప్రయివేటు పరం చేస్తున్నాయని.. ఆ పార్టీలకు పుట్టగతులు ఉండవని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గుత్తా పెట్టుబడిదారులు అని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు రాష్ట్రంలో కాలం చెల్లిందని అన్నారు. అలాగే బీజేపీ మతతత్వాన్ని రెచ్చకొడుతుందని విమర్శించారు. అలాంటి బీజేపీని బొంద పెడుతామని అన్నారు. ముఖ్యమంత్రిపై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తే.. ఊరుకోమని అన్నారు.
అలాగే తాము కేసీఆర్ కోసమే టీఆర్ఎస్ లో చేరామని అన్నారు. తమ అంజెండాలనే కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందని అన్నారు. అలాగే తనకు రాజకీయ అనుభవం ఎక్కువ ఉందని అన్నారు. ఈ అనుభవంతో తమ నియోజక వర్గాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే మంత్రి కేటీఆర్ సిరిసిల్లాలో గెలుస్తారని.. తమ తండ్రి చెన్నమనేని రాజేశ్వరరావు 2009 లోనే చెప్పారని అన్నారు. అప్పటి నుంచి సిరిసిల్లాలో కేటీఆర్ వరుసగా గెలుస్తున్నారని అన్నారు. అలాగే కేటీఆర్ సిరిసిల్లాను అభివృద్ధి చేశారని అన్నారు.