ముఖ్యమంత్రి కేసీఆరే తో మాకు విభేదాలు ఎందుకు ఉంటాయి.. కేసీఆర్ పూర్తి సహకారం ఉన్నందుకే కార్యక్రమం విజయవంతం అయ్యిందని చిన్నజీయర్ స్వామీ అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రథమ సేవకుడిని నేనే అని సీఎం కేసీఆరే అన్నరని చిన్నజీయర్ గుర్తు చేశారు. విభేదాలు అని సృష్టించడమే సరికాదని అన్నారు. మేము అందరిని కార్యక్రమానకి ఆహ్వానించామాని.. మాకు అందరూ సమానమే అని.. అధికార పక్షాలు, విపక్షాలు, స్వపక్షం అంతా సమానమే అని ఆయన అన్నారు. సమతామూర్తి దర్శనానికి కేసీఆర్ రాకపోవడానికి అనారోగ్యం లేదా పనుల ఒత్తిడి కారణం కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రేపటి శాంతి కల్యాణానికి కూడా కేసీఆర్‌ను ఆహ్వానించామని అన్నారు. ముస్లిం లీడర్లను కూడా ఆహ్వానించాం …అరబిక్ భాషలో కూడా ఆహ్వాన పత్రికలను అచ్చువేయించామని చిన్నజీయర్ అన్నారు. అందరిని రండి…రండి అని చెబుతాము …రాకండి రాకండి అని చెప్పే అలవాటు లేదని అన్నారు. 108 కళ్యాణాలు ఒకే చోట జరిగిన చరిత్ర లేదని ఆయన అన్నారు. రామానుజ చార్యుల విగ్రహం ను ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల నుంచి దర్శనముకు అనుమతి ఇస్తున్నామని అన్నారు.