ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. వారు రాసిస్తారు.. మీరు చెప్పేస్తారు.. మేం వింటాము.. ఇంటికి పోతామన్నారు. మీరు కూడా గత ప్రభుత్వం లాగే నడుస్తున్నారని సీరియస్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను కనీసం మార్కెటింగ్ కూడా చేసుకోలేకపోతే ఎలా..? అని నిలదీశారు.

ప్రజల కోసం, ఇండస్ట్రీ కోసం, ఉపాధి కోసం పని చేద్దామనే ఆలోచన లేదని మండిపడ్డారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది.. కానీ మనస్సే లేకపోతే ఏం చేస్తాం..? అని గొరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహించారు.