బండి సంజయ్‌కు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సవాల్‌.. రాజీనామా చేసే దమ్ముందా..

-

తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విమర్శలకు ప్రతివిమర్శలు, సవాళ్ల పర్యం నడుస్తోంది. అయితే.. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్‌ విసిరారు. చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్‌ రాజీనామాకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను ఎమ్మెల్యే కృష్ణారావు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నాయకులు భూములు కబ్జా చేస్తున్నారని బండి చేసిన ఆరోపణలపై స్పందించారు. భూ ఆక్రమణలపై బీజేపీ నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తే విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను చెరువులు కబ్జా చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. మరి బీజేపీ నేతలు ఆక్రమించారని తేలితే బండి సంజయ్‌ రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version