ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. నేడు బిజెపి తరఫున న్యాయవాది దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. బిజెపి ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని, ఏ ఎమ్మెల్యే ను కొనుగోలు చేయలేదని ఆయన తెలిపారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేరాలని సీఎం కేసీఆర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారని హైకోర్టుకి తెలిపారు. 2014 నుండి 2018 మధ్య 37 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు.
ఇక ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దృశ్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఎమ్మెల్యేలను కొనాలని చూసినప్పుడు పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడంలో తప్పేమీ లేదని ఆయన వివరించారు.